Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

1వకీర్తన​

Psa 1:1  దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక 
Psa 1:2  యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 
Psa 1:3  అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును. 
Psa 1:4  దుష్టులు ఆలాగున నుండకగాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. 
Psa 1:5  కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులునునీతిమంతుల సభలో పాపులును నిలువరు. 
Psa 1:6  నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియునుదుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 
Download Audio File

2వకీర్తన​

Psa 2:1  అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? 
Psa 2:2  మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు 
Psa 2:3  భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికినివిరోధముగా నిలువబడుచున్నారుఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. 
Psa 2:4  ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడుప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు 
Psa 2:5  ఆయన ఉగ్రుడై వారితో పలుకునుప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును 
Psa 2:6  నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను 
Psa 2:7  కట్టడను నేను వివరించెదనుయెహోవా నాకీలాగు సెలవిచ్చెనునీవు నా కుమారుడవునేడు నిన్ను కనియున్నాను. 
Psa 2:8  నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగానుభూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను. 
Psa 2:9  ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవుకుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగాపగులగొట్టెదవు 
Psa 2:10  కాబట్టి రాజులారా, వివేకులై యుండుడిభూపతులారా, బోధనొందుడి. 
Psa 2:11  భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడిగడగడ వణకుచు సంతోషించుడి. 
Psa 2:12  ఆయన కోపము త్వరగా రగులుకొనునుకుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు. 
Download Audio File 

3వకీర్తన​

Psa 3:1  యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారునామీదికి లేచువారు అనేకులు. 
Psa 3:2  దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదనినన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా. ) 
Psa 3:3  యెహోవా, నీవే నాకు కేడెముగానునీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. 
Psa 3:4  ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడుఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తరమిచ్చును. 
Psa 3:5  యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును 
Psa 3:6  పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిననునేను భయపడను 
Psa 3:7  యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుమునా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవునీవే. 
Psa 3:8  రక్షణ యెహోవాదినీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా. ) 
Download Audio File 

4వకీర్తన​

Psa 4:1  నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ముఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవేనన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము. 
Psa 4:2  నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు?ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు? 
Psa 4:3  యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి. నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును. 
Psa 4:4  భయమునొంది పాపము చేయకుడిమీరు పడకలమీద నుండగా మీ హృదయములలోధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా. ) 
Psa 4:5  నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవానునమ్ముకొనుడి 
Psa 4:6  మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము. 
Psa 4:7  వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములోపుట్టించితివి. 
Psa 4:8  యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. 
Download Audio File 

5వకీర్తన​

Psa 5:1  యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము. 
Psa 5:2  నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. 
Psa 5:3  యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునుఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసికాచియుందును. 
Psa 5:4  నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు 
Psa 5:5  డాంబికులు నీ సన్నిధిని నిలువలేరుపాపము చేయువారందరు నీకసహ్యులు 
Psa 5:6  అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువుకపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. 
Psa 5:7  నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములోప్రవేశించెదనునీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయముదిక్కు చూచి నమస్కరించెదను 
Psa 5:8  యెహోవా, నాకొఱకు పొంచియున్న వారినిబట్టినీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుమునీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. 
Psa 5:9  వారి నోట యథార్థత లేదువారి అంతరంగము నాశనకరమైన గుంటవారి కంఠము తెరచిన సమాధివారు నాలుకతో ఇచ్చకములాడుదురు. 
Psa 5:10  దేవా, వారు నీమీద తిరుగబడియున్నారువారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాకవారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము. 
Psa 5:11  నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యముఆనందధ్వని చేయుదురు. 
Psa 5:12  యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవేకేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవుకావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చిఉల్లసింతురు. 
Download Audio File 

6వకీర్తన​

Psa 6:1  యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుమునీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. 
Psa 6:2  యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుముయెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్నుబాగుచేయుము 
Psa 6:3  నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు? 
Psa 6:4  యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుమునీ కృపనుబట్టి నన్ను రక్షించుము. 
Psa 6:5  మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదుపాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దురు? 
Psa 6:6  నేను మూలుగుచు అలసియున్నానుప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవు చున్నది. 
Psa 6:7  విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవినాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి. 
Psa 6:8  యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడుపాపముచేయు వారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి. 
Psa 6:9  యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడుయెహోవా నా ప్రార్థన నంగీకరించును. 
Psa 6:10  నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారువారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు. 
Download Audio File 

7వకీర్తన​

Psa 7:1  యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నానునన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా 
Psa 7:2  వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండనన్ను తప్పించుము. 
Psa 7:3  యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసినయెడల 
Psa 7:4  నాచేత పాపము జరిగినయెడలనాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల 
Psa 7:5  శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్మునా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్మునా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించి ని గదా. (సెలా. ) 
Psa 7:6  యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్మునా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్మునన్ను ఆదుకొనుటకై మేల్కొనుమున్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా. 
Psa 7:7  జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడువారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. 
Psa 7:8  యెహోవా జనములకు తీర్పు తీర్చువాడుయెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములోనాకు న్యాయము తీర్చుము. 
Psa 7:9  హృదయములను అంతరింద్రియములనుపరిశీలించు నీతిగల దేవా, 
Psa 7:10  దుష్టుల చెడుతనము మాన్పుమునీతిగలవారిని స్థిరపరచుముయథార్థ హృదయులను రక్షించు దేవుడేనా కేడెమును మోయువాడై యున్నాడు. 
Psa 7:11  న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చునుఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. 
Psa 7:12  ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టునుతన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరచి యున్నాడు 
Psa 7:13  వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడుతన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు 
Psa 7:14  పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కని యున్నాడు. 
Psa 7:15  వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడుతాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను. 
Psa 7:16  వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చునువాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును. 
Psa 7:17  యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుసర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. 
Download Audio File 

8వకీర్తన​

Psa 8:1  యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది. 
Psa 8:2  శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై నీ విరోధులనుబట్టి బాలురయొక్కయు చంటి పిల్లలయొక్కయు స్తుతుల మూలముననీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు. 
Psa 8:3  నీ చేతిపనియైన నీ ఆకాశములనునీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా 
Psa 8:4  నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? 
Psa 8:5  దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. 
Psa 8:6  నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు. 
Psa 8:7  గొఱ్ఱలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్య ములను 
Psa 8:8  సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటినివాని పాదములక్రింద నీవు ఉంచి యున్నావు. 
Psa 8:9  యెహోవా మా ప్రభువాభూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది! 
Download Audio File 

9వకీర్తన​

Psa 9:1  నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదనుయెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివ రించెదను. 
Psa 9:2  మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించిహర్షించుచున్నానునీ నామమును కీర్తించెదను. 
Psa 9:3  నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావునీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పుతీర్చుచున్నావు 
Psa 9:4  కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురునీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. 
Psa 9:5  నీవు అన్యజనులను గద్దించి యున్నావు, దుష్టులనునశింపజేసి యున్నావువారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టియున్నావు. 
Psa 9:6  శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండనిర్మూలమైరినీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండబొత్తిగా నశించెను. 
Psa 9:7  యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడైయున్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి యున్నాడు. 
Psa 9:8  యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చునుయథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును. 
Psa 9:9  నలిగినవారికి తాను మహా దుర్గమగునుఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును 
Psa 9:10  యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావుకావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు 
Psa 9:11  సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడిఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. 
Psa 9:12  ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణచేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనునువారి మొఱ్ఱను ఆయన మరువడు. 
Psa 9:13  నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచుసీయోను కుమార్తె గుమ్మములలోనీ రక్షణనుబట్టి హర్షించునట్లుయెహోవా, నన్ను కరుణించుము. 
Psa 9:14  మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధనుచూడుము. 
Psa 9:15  తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది. 
Psa 9:16  యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్‌ సెలా. ) 
Psa 9:17  దుష్టులును దేవుని మరచు జనులందరునుపాతాళమునకు దిగిపోవుదురు. 
Psa 9:18  దరిద్రులు నిత్యము మరువబడరుబాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికినినశించదు. 
Psa 9:19  యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాకనీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక. 
Psa 9:20  యెహోవా, వారిని భయపెట్టుముతాము నరమాత్రులమని జనులు తెలిసికొందురు గాక. (సెలా. ) 
Download Audio File

10వకీర్తన​

Psa 10:1  యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచు. .. చున్నావు? ఆపత్కాలములలో నీ వెందుకు దాగి యున్నావు? 
Psa 10:2  దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడువారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక 
Psa 10:3  దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురులోభులు యెహోవాను తిరస్కరింతురు 
Psa 10:4  దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురుదేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు 
Psa 10:5  వారెల్లప్పడు భయము మానుకొని ప్రవర్తింతురునీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరింతురు. 
Psa 10:6  మేము కదల్చబడము, తరతరములవరకు ఆపదచూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు 
Psa 10:7  వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నదివారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి. 
Psa 10:8  తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురుచాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురువారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును. 
Psa 10:9  గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచి యుందురుబాధపడువారిని పట్టుకొన పొంచి యుందురుబాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. 
Psa 10:10  కాగా నిరాధారులు నలిగి వంగుదురువారి బలాత్కారమువలన నిరాధారులు కూలుదురు. 
Psa 10:11  దేెెవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. 
Psa 10:12  యెహోవా లెమ్ము, దేవా బాధపడువారిని మరువకనీ చెయ్యి యెత్తుము 
Psa 10:13  దుష్టులు దేవుని తృణీకరించుట యేల? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అను కొనుటయేల? 
Psa 10:14  నీవు దీనిని చూచి యున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకైనీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావునిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురుతండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు 
Psa 10:15  దుష్టుల భుజమును విరుగగొట్టుముచెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవువరకుదానిని గూర్చి విచారణ చేయుము. 
Psa 10:16  యెహోవా నిరంతరము రాజై యున్నాడుఆయన దేశములోనుండి అన్యజనులు నశించి పోయిరి. 
Psa 10:17  యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు నట్లుబాధపడువారి కోరికను నీవు విని యున్నావు 
Psa 10:18  తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆల కించితివి. 
Download Audio File

11వకీర్తన​

Psa 11:1  యెహోవా శరణుజొచ్చియున్నానుపక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల? 
Psa 11:2  దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారుచీకటిలో యథార్థహృదయులమీద వేయుటకైతమ బాణములు నారియందు సంధించి యున్నారు 
Psa 11:3  పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? 
Psa 11:4  యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడుయెహోవా సింహాసనము ఆకాశమందున్నదిఆయన నరులను కన్నులార చూచుచున్నాడుతన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. 
Psa 11:5  యెహోవా నీతిమంతులను పరిశీలించునుదుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు, 
Psa 11:6  దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారికి పానీయభాగమగును. 
Psa 11:7  యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. 
Download Audio File 

12వకీర్తన​

Psa 12:1  యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరివిశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి. 
Psa 12:2  అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురుమోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. 
Psa 12:3  యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినిబింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. 
Psa 12:4  మా నాలుకలచేత మేము సాధించెదముమా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను కొందురు. 
Psa 12:5  బాధపడువారికి చేయబడిన బలాత్కారమునుబట్టియుదరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదనురక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అనియెహోవా సెలవిచ్చుచున్నాడు. 
Psa 12:6  యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు. 
Psa 12:7  యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవుఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించె దవు. 
Psa 12:8  నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడుదుష్టులు గర్విష్టులై నలుదిక్కుల తిరుగులాడుదురు. 
Download Audio File 

13వకీర్తన​

Psa 13:1  యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా?నాకెంతకాలము విముఖుడవై యుందువు? 
Psa 13:2  ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును? 
Psa 13:3  యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము 
Psa 13:4  నేను మరణనిద్ర నొందకుండనువాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండనునేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండనునా కన్నులకు వెలుగిమ్ము. 
Psa 13:5  నేనైతే నీ కృపయందు నమి్మక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నదియెహోవా 
Psa 13:6  నాకు మహోపకారములు చేసియున్నాడునేను ఆయనను కీర్తించెదను. 
Download Audio File 

14వకీర్తన​

Psa 14:1  దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు. 
Psa 14:2  వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనియెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను 
Psa 14:3  వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారుమేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు 
Psa 14:4  యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు. 
Psa 14:5  ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్ష మున నున్నాడు 
Psa 14:6  బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు. 
Psa 14:7  సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. 
Download Audio File 

15వకీర్తన​

Psa 15:1  యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు? 
Psa 15:2  యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచుహృదయపూర్వకముగా నిజము పలుకువాడే. 
Psa 15:3  అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడుతన పొరుగువానిమీద నింద మోపడు 
Psa 15:4  అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారినిసన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. 
Psa 15:5  తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడుఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. 
Download Audio File

16వకీర్తన​

Psa 16:1  దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. 
Psa 16:2  నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును 
Psa 16:3  నేనీలాగందునుభూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు. 
Psa 16:4  యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికిశ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపనువారి పేళ్లు నా పెదవులనెత్తను. 
Psa 16:5  యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగమునీవే నా భాగమును కాపాడుచున్నావు. 
Psa 16:6  మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెనుశ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను. 
Psa 16:7  నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదనురాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకుబోధించుచున్నది. 
Psa 16:8  సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుకనేను కదల్చబడను. 
Psa 16:9  అందువలన నా హృదయము సంతోషించుచున్నదినా ఆత్మ హర్షించుచున్నదినా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది 
Psa 16:10  ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు 
Psa 16:11  జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు. 
Download Audio File 

17వకీర్తన​

Psa 17:1  యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱ నంగీకరించుమునా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవులనుండి వచ్చునదికాదు. 
Psa 17:2  నీ సన్నిధినుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును. 
Psa 17:3  రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివినన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయుకానరాలేదునోటిమాటచేత నేను అతిక్రమింపను 
Psa 17:4  మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకైనీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను. 
Psa 17:5  నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు. 
Psa 17:6  నేను నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నాను దేవా, నీవు నాకుత్తరమిచ్చెదవునాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. 
Psa 17:7  నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారి చేతి లోనుండి నీ కుడిచేత రక్షించువాడా, 
Psa 17:8  నీ కృపాతిశయములను చూపుము. 
Psa 17:9  ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్నుకాపాడుమునన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుమునన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్కకుండనునీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము. 
Psa 17:10  వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారువారి నోరు గర్వముగా మాటలాడును. 
Psa 17:11  మా అడుగుజాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని యున్నారుమమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. 
Psa 17:12  వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలెను ఉన్నారు. 
Psa 17:13  యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ గొట్టుముదుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము 
Psa 17:14  లోకులచేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండినీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు. 
Psa 17:15  నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతోనా ఆశను తీర్చుకొందును. 
Download Audio File 

18వకీర్తన​

Psa 18:1  యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను. 
Psa 18:2  యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడునా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడునేను ఆశ్రయించియున్న నా దుర్గము. 
Psa 18:3  కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షించును. 
Psa 18:4  మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను 
Psa 18:5  పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను 
Psa 18:6  నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెనునా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను. 
Psa 18:7  అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెనుఆయన కోపింపగా అవి కంపించెను. 
Psa 18:8  ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను 
Psa 18:9  నిప్పుకణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెనుఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మియుండెను. 
Psa 18:10  కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను. 
Psa 18:11  గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెనుజలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసికొనెను. 
Psa 18:12  ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడ గండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను. 
Psa 18:13  యెహోవా ఆకాశమందు గర్జనచేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెనువడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను. 
Psa 18:14  ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెనుమెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను. 
Psa 18:15  యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగానీ గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. 
Psa 18:16  ఉన్నతస్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెనునన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను. 
Psa 18:17  బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటె బలిష్టులైయుండగావారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను. 
Psa 18:18  ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. 
Psa 18:19  విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెనునేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్నుతప్పించెను. 
Psa 18:20  నా నీతినిబట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. 
Psa 18:21  యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నానుభక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను 
Psa 18:22  ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టు చున్నానుఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను 
Psa 18:23  దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. 
Psa 18:24  కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. 
Psa 18:25  దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు 
Psa 18:26  సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపు దువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు 
Psa 18:27  శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. 
Psa 18:28  నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును 
Psa 18:29  నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును. 
Psa 18:30  దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలముతన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము. 
Psa 18:31  యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? 
Psa 18:32  నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే. 
Psa 18:33  ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు. 
Psa 18:34  నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును. 
Psa 18:35  నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెనునీ సాత్వికము నన్ను గొప్పచేసెను. 
Psa 18:36  నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు. 
Psa 18:37  నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయువరకు నేను తిరుగను. 
Psa 18:38  వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగ ద్రొక్కుదును 
Psa 18:39  యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచినవారిని నా క్రింద అణచివేసితివి 
Psa 18:40  నా శత్రువులను వెనుకకు నీవు మళ్లచేసితివి నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని 
Psa 18:41  వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేక పోయెను యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి కుత్తరమియ్యకుండును. 
Psa 18:42  అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టితినివీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితిని. 
Psa 18:43  ప్రజలు చేయు కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివినన్ను అన్యజనులకు అధికారిగా చేసితివినేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు 
Psa 18:44  నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు 
Psa 18:45  అన్యులు నిస్త్రాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. 
Psa 18:46  యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడునా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. 
Psa 18:47  ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే. 
Psa 18:48  ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును. నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువుబలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండినీవు నన్ను విడిపించుదువు 
Psa 18:49  అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదనునీ నామకీర్తన గానము చేసెదను. 
Psa 18:50  నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు 
Download Audio File 

19వకీర్తన​

Psa 19:1  ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. 
Psa 19:2  పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. 
Psa 19:3  వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. 
Psa 19:4  వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నదిలోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవివాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. 
Psa 19:5  అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడుశూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. 
Psa 19:6  అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు. 
Psa 19:7  యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయునుయెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. 
Psa 19:8  యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచునుయెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్ను లకు వెలుగిచ్చును. 
Psa 19:9  యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచునుయెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 
Psa 19:10  అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవితేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి. 
Psa 19:11  వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును. 
Psa 19:12  తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్నునిర్దోషినిగా తీర్చుము. 
Psa 19:13  దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహముచేయకుండ నిందా రహితుడనగుదును. 
Psa 19:14  యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమునునీ దృష్టికి అంగీకారములగును గాక. 
Download Audio File 

20వకీర్తన​

Psa 20:1  ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. 
Psa 20:2  పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయును గాకసీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక. 
Psa 20:3  ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాకనీ దహనబలులను అంగీకరించును గాక. 
Psa 20:4  నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. 
Psa 20:5  యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాముమా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నామునీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక. 
Psa 20:6  యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియునురక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపునుతన పరిశుద్ధాకాశములోనుండి అతని కుత్తరమిచ్చును. 
Psa 20:7  కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురుమనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము. 
Psa 20:8  వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. 
Psa 20:9  యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకుత్తరమిచ్చును గాక. 
Download Audio File

21వకీర్తన​

Psa 21:1  యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించు చున్నాడునీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. 
Psa 21:2  అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలోనుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. 
Psa 21:3  శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. 
Psa 21:4  ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతని కనుగ్రహించి యున్నావుసదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసియున్నావు. 
Psa 21:5  నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు. 
Psa 21:6  నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించియున్నావునీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసియున్నావు. 
Psa 21:7  ఏలయనగా రాజు యెహోవాయందు నమి్మక యుంచు చున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును. 
Psa 21:8  నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును. 
Psa 21:9  నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురుతన కోపమువలన యెహోవా వారిని నిర్మూలముచేయును అగ్ని వారిని దహించును. 
Psa 21:10  భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవునరులలో నుండకుండ వారి సంతానమును నశింపజేసెదవు. 
Psa 21:11  వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి దురు పాయము పన్నిరికాని దానిని కొనసాగింప లేకపోయిరి. 
Psa 21:12  నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖముమీదకొట్టుదువు. 
Psa 21:13  యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించు కొనుముమేము గానముచేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. 
Download Audio File 

22వకీర్తన​

Psa 22:1  నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు? 
Psa 22:2  నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు. 
Psa 22:3  నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రములమీద ఆసీనుడవై యున్నావు. 
Psa 22:4  మా పితరులు నీయందు నమి్మక యుంచిరి వారు నీయందు నమి్మక యుంచగా నీవు వారిని రక్షించితివి. 
Psa 22:5  వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి నీయందు నమి్మక యుంచి సిగ్గుపడకపోయిరి. 
Psa 22:6  నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను. 
Psa 22:7  నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు. 
Psa 22:8  యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమోవాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు. 
Psa 22:9  గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగానీవే గదా నాకు నమి్మక పుట్టించితివి. 
Psa 22:10  గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవునీవే. 
Psa 22:11  శ్రమ వచ్చియున్నది, సహాయము చేయువాడెవడును లేడునాకు దూరముగా నుండకుము. 
Psa 22:12  వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి. 
Psa 22:13  చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు 
Psa 22:14  నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవినా హృదయము నా అంతరంగమందు మైనమువలెకరగియున్నది. 
Psa 22:15  నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు. 
Psa 22:16  కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. 
Psa 22:17  నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు 
Psa 22:18  నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు. 
Psa 22:19  యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. 
Psa 22:20  ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము. 
Psa 22:21  సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించినాకుత్తరమిచ్చి యున్నావు 
Psa 22:22  నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను. 
Psa 22:23  యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడియాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడిఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకుభయపడుడి 
Psa 22:24  ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను. 
Psa 22:25  మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడె దనుఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. 
Psa 22:26  దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరుమీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును. 
Psa 22:27  భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు 
Psa 22:28  రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే. 
Psa 22:29  భూమిమీద వర్థిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరుతమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగువారందరు ఆయన సన్నిధిని మోకరించెదరు 
Psa 22:30  ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువునుగూర్చి వివరింతురు. 
Psa 22:31  వారు వచ్చిఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురుఆయన నీతిని వారికి ప్రచురపరతురు. 
Download Audio File 

23వకీర్తన​

Psa 23:1  యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. 
Psa 23:2  పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడుశాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. 
Psa 23:3  నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు. 
Psa 23:4  గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును. 
Psa 23:5  నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువునూనెతో నా తల అంటియున్నావునా గిన్నె నిండి పొర్లుచున్నది. 
Psa 23:6  నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చునుచిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. 
Download Audio File 

24వకీర్తన​

Psa 24:1  భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే. 
Psa 24:2  ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను. 
Psa 24:3  యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? 
Psa 24:4  వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. 
Psa 24:5  వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును. 
Psa 24:6  ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా. ) 
Psa 24:7  గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి. 
Psa 24:8  మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. 
Psa 24:9  గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి. 
Psa 24:10  మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే. ఆయనే యీ మహిమగల రాజు. 
Download Audio File 

25వకీర్తన​

Psa 25:1  యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను. 
Psa 25:2  నా దేవా, నీయందు నమి్మక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము 
Psa 25:3  నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. 
Psa 25:4  యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము. 
Psa 25:5  నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను. 
Psa 25:6  యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసి కొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా. 
Psa 25:7  నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచు కొనుము. 
Psa 25:8  యెహోవా ఉత్తముడును యథార్థ వంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. 
Psa 25:9  న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును. 
Psa 25:10  ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసన ములను గైకొనువారి విషయములో యెహోవాత్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి 
Psa 25:11  యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము. 
Psa 25:12  యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. 
Psa 25:13  అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. 
Psa 25:14  యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. 
Psa 25:15  నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగి యున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును. 
Psa 25:16  నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. 
Psa 25:17  నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము. 
Psa 25:18  నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము. 
Psa 25:19  నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. 
Psa 25:20  నేను నీ శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. 
Psa 25:21  నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. 
Psa 25:22  దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. 
Download Audio File 

26వకీర్తన​

Psa 26:1  యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించు చున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమి్మక యుంచియున్నాను. 
Psa 26:2  యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షిం చుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశో ధించుము. 
Psa 26:3  నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను 
Psa 26:4  పనికిమాలినవారితో నేను సాంగత్యముచేయను వేషధారులతో పొందుచేయను. 
Psa 26:5  దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యముచేయను 
Psa 26:6  నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయు దును. 
Psa 26:7  అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్యకార్యములను వివరింతును. 
Psa 26:8  యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించు చున్నాను. 
Psa 26:9  పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము. 
Psa 26:10  వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది. 
Psa 26:11  నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. 
Psa 26:12  సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యెహోవాను స్తుతించెదను. 
Download Audio File 

27వకీర్తన​

Psa 27:1  యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? 
Psa 27:2  నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి 
Psa 27:3  నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నామీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. 
Psa 27:4  యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆల యములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. 
Psa 27:5  ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును. 
Psa 27:6  ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను. 
Psa 27:7  యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించు నప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము. 
Psa 27:8  నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. 
Psa 27:9  నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము 
Psa 27:10  నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. 
Psa 27:11  యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము. 
Psa 27:12  అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము 
Psa 27:13  సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము 
Psa 27:14  ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము. 
Download Audio File 

28వకీర్తన​

Psa 28:1  యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును. 
Psa 28:2  నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. 
Psa 28:3  భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయు నట్టు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడు దురు 
Psa 28:4  వారి క్రియలనుబట్టి వారి దుష్టక్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయుము. వారు చేసిన పనినిబట్టి వారికి ప్రతికారము చేయుము వారికి తగిన ప్రతిఫలమిమ్ము. 
Psa 28:5  యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. 
Psa 28:6  యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక. 
Psa 28:7  యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమి్మకయుంచెన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. 
Psa 28:8  యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము. 
Psa 28:9  నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వ దింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. 
Download Audio File 

29వకీర్తన​

Psa 29:1  దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి 
Psa 29:2  యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి. 
Psa 29:3  యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు. 
Psa 29:4  యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది. 
Psa 29:5  యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. 
Psa 29:6  దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును. 
Psa 29:7  యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది. 
Psa 29:8  యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును 
Psa 29:9  యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభా వము అనుచున్నవి. 
Psa 29:10  యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు. 
Psa 29:11  యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును. 
Download Audio File

30వకీర్తన​

Psa 30:1  యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతో షింపనియ్యక నీవు నన్నుద్ధరించి యున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. 
Psa 30:2  యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. 
Psa 30:3  యెహోవా, పాతాళములోనుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండ నీవు నన్ను బ్రదికించితివి. 
Psa 30:4  యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. 
Psa 30:5  ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును. 
Psa 30:6  నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అను కొంటిని. 
Psa 30:7  యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిర పరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత జెందితిని 
Psa 30:8  యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన ఏమి లాభము? 
Psa 30:9  మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి అది వివరించునా? 
Psa 30:10  యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము యెహోవా, నాకు సహాయుడవై యుండుము 
Psa 30:11  నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు. 
Psa 30:12  నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించె దను. 
Download Audio File 

31వకీర్తన​

Psa 31:1  యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము. 
Psa 31:2  నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారముగల యిల్లుగాను ఉండుము. 
Psa 31:3  నా కొండ నాకోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే. 
Psa 31:4  నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలోనుండి నన్ను తప్పించుము. 
Psa 31:5  నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. 
Psa 31:6  నేను యెహోవాను నమ్ముకొని యున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అస హ్యులు. 
Psa 31:7  నీవు నా బాధను దృష్టించి యున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు కావున నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతో షించెదను. 
Psa 31:8  నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి. 
Psa 31:9  యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. 
Psa 31:10  నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించు చున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి. 
Psa 31:11  నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను నా నెళవరులకు భీకరుడనై యున్నాను వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారి పోవుదురు. 
Psa 31:12  మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని. 
Psa 31:13  అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. 
Psa 31:14  యెహోవా, నీయందు నమి్మక యుంచియున్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. 
Psa 31:15  నా కాలగతులు నీ వశములో నున్నవి. నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము. 
Psa 31:16  నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము. 
Psa 31:17  యెహోవా, నీకు మొఱ్ఱపెట్టియున్నాను నన్ను సిగ్గు నొందనియ్యకుము భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక; పాతాళమునందు వారు మౌనులై యుందురు గాక. 
Psa 31:18  అబద్ధికుల పెదవులు మూయబడును గాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు. 
Psa 31:19  నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. 
Psa 31:20  మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచు చున్నావు 
Psa 31:21  ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్తుతినొందును గాక. 
Psa 31:22  భీతిచెందినవాడనైనీకు కనబడకుండ నేను నాశన మైతిననుకొంటిని అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. 
Psa 31:23  యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతి కారము చేయును. 
Psa 31:24  యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. 
Download Audio File 

32వకీర్తన​

Psa 32:1  తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 
Psa 32:2  యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు. 
Psa 32:3  నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి. 
Psa 32:4  దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా. ) 
Psa 32:5  నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా. ) 
Psa 32:6  కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు. 
Psa 32:7  నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు 
Psa 32:8  నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను 
Psa 32:9  బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను. 
Psa 32:10  భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు నమి్మకయుంచువానిని కృప ఆవ రించుచున్నది. 
Psa 32:11  నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లపించుడి యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి. 
Download Audio File 

33వకీర్తన​

Psa 33:1  నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము. .. చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము. 
Psa 33:2  సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి 
Psa 33:3  ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. 
Psa 33:4  యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది. 
Psa 33:5  ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది. 
Psa 33:6  యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. 
Psa 33:7  సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. 
Psa 33:8  లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుప వలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను. 
Psa 33:9  ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. 
Psa 33:10  అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును. 
Psa 33:11  యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. 
Psa 33:12  యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. 
Psa 33:13  యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు. 
Psa 33:14  తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు. 
Psa 33:15  ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించు వాడు. 
Psa 33:16  ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు. 
Psa 33:17  రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు. 
Psa 33:18  వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును 
Psa 33:19  యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది. 
Psa 33:20  మనము యెహోవా పరిశుద్ధనామమందు నమి్మకయుంచి యున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించు చున్నది 
Psa 33:21  మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొను చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు. 
Psa 33:22  యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక. 
Download Audio File 

34వకీర్తన​

Psa 34:1  నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. 
Psa 34:2  యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. 
Psa 34:3  నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. 
Psa 34:4  నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను. 
Psa 34:5  వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. 
Psa 34:6  ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను. 
Psa 34:7  యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును 
Psa 34:8  యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. 
Psa 34:9  యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. 
Psa 34:10  సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు. 
Psa 34:11  పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను. 
Psa 34:12  బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువా డెవడైన నున్నాడా? 
Psa 34:13  చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచు కొనుము. 
Psa 34:14  కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము. 
Psa 34:15  యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. 
Psa 34:16  దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది. 
Psa 34:17  నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును. 
Psa 34:18  విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. 
Psa 34:19  నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపిం చును. 
Psa 34:20  ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు. 
Psa 34:21  చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచ బడుదురు 
Psa 34:22  యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధు లుగా ఎంచబడరు. 
Download Audio File 

35వకీర్తన​

Psa 35:1  యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె మాడుము నాతో పోరాడువారితో పోరాడుము. 
Psa 35:2  కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. 
Psa 35:3  ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. 
Psa 35:4  నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింప బడి లజ్జపడుదురు గాక. 
Psa 35:5  యెహోవా దూత వారిని పారదోలును గాక వారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు గాక. 
Psa 35:6  యెహోవా దూత వారిని తరుమును గాక వారి త్రోవ చీకటియై జారుడుగా నుండును గాక. 
Psa 35:7  నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. 
Psa 35:8  వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక. 
Psa 35:9  అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును. 
Psa 35:10  అప్పుడుయెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడి పించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును. 
Psa 35:11  కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు. 
Psa 35:12  మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని. 
Psa 35:13  వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది. 
Psa 35:14  అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని. 
Psa 35:15  నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. 
Psa 35:16  విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి. 
Psa 35:17  ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం పుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము 
Psa 35:18  అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను. 
Psa 35:19  నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీట నియ్యకుము. 
Psa 35:20  వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు. 
Psa 35:21  నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు కొనుచున్నారు. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి నదే అనుచున్నారు. 
Psa 35:22  యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన ముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. 
Psa 35:23  నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యె మాడుటకు లెమ్ము. 
Psa 35:24  యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక. 
Psa 35:25  ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అను కొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు గాక 
Psa 35:26  నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక 
Psa 35:27  నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. 
Psa 35:28  నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును. 
Download Audio File 

36వకీర్తన​

Psa 36:1  భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నదివాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు. 
Psa 36:2  వాని దోషము బయలుపడి అసహ్యముగాకనబడు వరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయు చున్నది. 
Psa 36:3  వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసి యున్నాడు. 
Psa 36:4  వాడు మంచముమీదనే పాపయోచనను యోచిం చును వాడు కానినడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. 
Psa 36:5  యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది. 
Psa 36:6  నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే 
Psa 36:7  దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. 
Psa 36:8  నీ మందిరముయొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు చున్నావు. 
Psa 36:9  నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు చున్నాము. 
Psa 36:10  నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలు పుము. 
Psa 36:11  గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకుము. 
Psa 36:12  అదిగో పాపముచేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండ వారు పడద్రోయబడి యున్నారు. 
Download Audio File

37వకీర్తన​

Psa 37:1  చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. 
Psa 37:2  వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు 
Psa 37:3  యెహోవాయందు నమి్మకయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము 
Psa 37:4  యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. 
Psa 37:5  నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును. 
Psa 37:6  ఆయన వెలుగునువలె నీ నీతిని మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. 
Psa 37:7  యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము. 
Psa 37:8  కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము 
Psa 37:9  కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. 
Psa 37:10  ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. 
Psa 37:11  దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు 
Psa 37:12  భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురు వారినిచూచి పండ్లు కొరుకుదురు. 
Psa 37:13  వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. 
Psa 37:14  దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టి యున్నారు 
Psa 37:15  వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును. 
Psa 37:16  నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము. 
Psa 37:17  భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు 
Psa 37:18  నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. 
Psa 37:19  ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు కరవు దినములలో వారు తృప్తిపొందుదురు. 
Psa 37:20  భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి యుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు. 
Psa 37:21  భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. 
Psa 37:22  యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించినవారు నిర్మూలమగుదురు. 
Psa 37:23  ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. 
Psa 37:24  యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు. 
Psa 37:25  నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు. 
Psa 37:26  దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు. 
Psa 37:27  కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు 
Psa 37:28  ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్న టెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. 
Psa 37:29  నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు. 
Psa 37:30  నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును. 
Psa 37:31  వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు. 
Psa 37:32  భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు. 
Psa 37:33  వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషు లుగా ఎంచడు. 
Psa 37:34  యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. 
Psa 37:35  భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి యుండెను. 
Psa 37:36  అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను. 
Psa 37:37  నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు 
Psa 37:38  భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము 
Psa 37:39  బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చి యున్నారు గనుక 
Psa 37:40  ఆయన భక్తిహీనుల చేతిలోనుండి వారిని విడిపించి రక్షించును. 
Download Audio File 

38వకీర్తన​

Psa 38:1  యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతచేత నన్ను శిక్షింపకుము. 
Psa 38:2  నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది. 
Psa 38:3  నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు. 
Psa 38:4  నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి. 
Psa 38:5  నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. 
Psa 38:6  నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. 
Psa 38:7  నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు. 
Psa 38:8  నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను 
Psa 38:9  ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు. 
Psa 38:10  నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను. 
Psa 38:11  నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు 
Psa 38:12  నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డు చున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్ను చున్నారు. 
Psa 38:13  చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. 
Psa 38:14  నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని. 
Psa 38:15  యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను. 
Psa 38:16  ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక. 
Psa 38:17  నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు. 
Psa 38:18  నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమునుగూర్చి విచారపడుచున్నాను. 
Psa 38:19  నా శత్రువులు చురుకైనవారును బలవంతులునై యున్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. 
Psa 38:20  మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి 
Psa 38:21  యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము. 
Psa 38:22  రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. 
Download Audio File 

39వకీర్తన​

Psa 39:1  నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని. 
Psa 39:2  నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను. 
Psa 39:3  నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని 
Psa 39:4  యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన గోరుచున్నాను. 
Psa 39:5  నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. (సెలా. ) 
Psa 39:6  మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. 
Psa 39:7  ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను. 
Psa 39:8  నా అతిక్రమములన్నిటినుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. 
Psa 39:9  దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని. 
Psa 39:10  నీవు పంపిన తెగులు నా మీదనుండి తొలగింపుము. నీ చేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను. 
Psa 39:11  దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడ గొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా. ) 
Psa 39:12  యెహోవా, నా ప్రార్థన ఆలంకిపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను 
Psa 39:13  నేను వెళ్లిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. 
Download Audio File