Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

63వకీర్తన​

Psa 63:1  దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును 
Psa 63:2  నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. 
Psa 63:3  నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును. 
Psa 63:4  నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు 
Psa 63:5  క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది 
Psa 63:6  కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను. 
Psa 63:7  నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. 
Psa 63:8  నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది. 
Psa 63:9  నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు 
Psa 63:10  బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కలపాలగుదురు. 
Psa 63:11  రాజు దేవునిబట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడువారి నోరు మూయబడును. 
Download Audio File 

No comments:

Post a Comment