Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

28వకీర్తన​

Psa 28:1  యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును. 
Psa 28:2  నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. 
Psa 28:3  భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయు నట్టు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడు దురు 
Psa 28:4  వారి క్రియలనుబట్టి వారి దుష్టక్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయుము. వారు చేసిన పనినిబట్టి వారికి ప్రతికారము చేయుము వారికి తగిన ప్రతిఫలమిమ్ము. 
Psa 28:5  యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. 
Psa 28:6  యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక. 
Psa 28:7  యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమి్మకయుంచెన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. 
Psa 28:8  యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము. 
Psa 28:9  నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వ దింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. 
Download Audio File 

No comments:

Post a Comment