Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

98వకీర్తన​

Psa 98:1  యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది. 
Psa 98:2  యెహోవా తన రక్షణను వెల్లడిచేసి యున్నాడు అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచియున్నాడు. 
Psa 98:3  ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్య తలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. 
Psa 98:4  సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి. 
Psa 98:5  సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి. 
Psa 98:6  బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి. 
Psa 98:7  సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక. 
Psa 98:8  ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. 
Psa 98:9  భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు. 
Download Audio File 

No comments:

Post a Comment