Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

30వకీర్తన​

Psa 30:1  యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతో షింపనియ్యక నీవు నన్నుద్ధరించి యున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. 
Psa 30:2  యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. 
Psa 30:3  యెహోవా, పాతాళములోనుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండ నీవు నన్ను బ్రదికించితివి. 
Psa 30:4  యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. 
Psa 30:5  ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును. 
Psa 30:6  నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అను కొంటిని. 
Psa 30:7  యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిర పరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత జెందితిని 
Psa 30:8  యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన ఏమి లాభము? 
Psa 30:9  మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి అది వివరించునా? 
Psa 30:10  యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము యెహోవా, నాకు సహాయుడవై యుండుము 
Psa 30:11  నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు. 
Psa 30:12  నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించె దను. 
Download Audio File 

No comments:

Post a Comment