Psa 55:1 దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.
Psa 55:2 నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.
Psa 55:3 శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టులబలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను. వారు నామీద దోషము మోపుచున్నారుఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు.
Psa 55:4 నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది
Psa 55:5 దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను.
Psa 55:6 ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే
Psa 55:7 త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని
Psa 55:8 అరణ్యములో నివసించియుందునే అను కొంటిని.
Psa 55:9 పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.
Psa 55:10 రాత్రింబగళ్లు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి.
Psa 55:11 దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి.
Psa 55:12 నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.
Psa 55:13 ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు.
Psa 55:14 మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిరమునకు పోయి యున్నవారము.
Psa 55:15 వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగము నందును ఉన్నది
Psa 55:16 అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును.
Psa 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
Psa 55:18 నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు.
Psa 55:19 పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తర మిచ్చును.
Psa 55:20 తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.
Psa 55:21 వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.
Psa 55:22 నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
Psa 55:23 దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచి యున్నాను.
Download Audio File

No comments:
Post a Comment