Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

85వకీర్తన​

Psa 85:1  యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి యున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు. 
Psa 85:2  నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసి యున్నావు (సెలా. ) 
Psa 85:3  నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు 
Psa 85:4  మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. 
Psa 85:5  ఎల్లకాలము మామీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? 
Psa 85:6  నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రదికింపవా? 
Psa 85:7  యెహోవా, నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయుము. 
Psa 85:8  దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవిని బెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభ వచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక. 
Psa 85:9  మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది. 
Psa 85:10  కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి. 
Psa 85:11  భూమిలోనుండి సత్యము మొలుచును ఆకాశములోనుండి నీతి పారజూచును. 
Psa 85:12  యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును. 
Psa 85:13  నీతి ఆయనకు ముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును. 
Download Audio File 

No comments:

Post a Comment