Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

56వకీర్తన​

Psa 56:1  దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగ వలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించు చున్నారు. 
Psa 56:2  అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగ వలెనని యున్నారు 
Psa 56:3  నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్ర యించుచున్నాను. 
Psa 56:4  దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమి్మకయుంచి యున్నాను నేను భయ పడను శరీరధారులు నన్నేమి చేయగలరు? 
Psa 56:5  దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. 
Psa 56:6  వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. 
Psa 56:7  తాము చేయు దోషక్రియలచేత వారు తప్పించు కొందురా? దేవా, కోపముచేత జనములను అణగగొట్టుము 
Psa 56:8  నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో1 కనబడును గదా. 
Psa 56:9  నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలి యును. 
Psa 56:10  దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను యెహోవానుబట్టి ఆయన వాక్యమును కీర్తించెదను 
Psa 56:11  నేను దేవునియందు నమి్మకయుంచి యున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు? 
Psa 56:12  దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించు నట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించి యున్నావు. 
Psa 56:13  నేను నీకు మ్రొక్కుకొని యున్నాను నేను నీకు స్తుతియాగముల నర్పించెదను. 
Download Audio File 

No comments:

Post a Comment