Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

53వకీర్తన​

Psa 53:1  దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురుమేలు చేయువాడొకడును లేడు. 
Psa 53:2  వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనిదేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. 
Psa 53:3  వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు మేలు చేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు. 
Psa 53:4  దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? 
Psa 53:5  భయకారణము లేనిచోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడివేయువారి యెముకలను దేవుడు చెదర గొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి. 
Psa 53:6  సీయోనులోనుండి ఇశ్రాయేలునకురక్షణకలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును. 
Download Audio File 

No comments:

Post a Comment