Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

71వకీర్తన​

Psa 71:1  యెహోవా, నేను నీ శరణుజొచ్చి యున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము. 
Psa 71:2  నీ నీతినిబట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. 
Psa 71:3  నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు. 
Psa 71:4  నా దేవా, భక్తిహీనుల చేతిలోనుండి నన్ను రక్షిం పుము. కీడు చేయువారి పట్టులోనుండి బలాత్కారుని పట్టులోనుండి నన్ను విడిపింపుము. 
Psa 71:5  నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయము నీవే. 
Psa 71:6  గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై యుంటివి తల్లిగర్భమునుండి నన్ను ఉద్భవింపజేసినవాడవు నీవే నిన్నుగూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. 
Psa 71:7  నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. 
Psa 71:8  నీ కీర్తితోను నీ ప్రభావవర్ణనతోను దినమంతయు నా నోరు నిండియున్నది. 
Psa 71:9  వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. 
Psa 71:10  నా శత్రువులు నన్నుగూర్చి మాటలాడుకొను చున్నారు నా ప్రాణముకొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. 
Psa 71:11  దేవుడు వానిని విడిచెను తప్పించువారెవరును లేరు వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు. 
Psa 71:12  దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము 
Psa 71:13  నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురు గాక. నాకు కీడుచేయ జూచువారు నిందపాలై మాన భంగము నొందుదురుగాక. 
Psa 71:14  నేను ఎల్లప్పుడు నిరీక్షింతును నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును 
Psa 71:15  నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు. 
Psa 71:16  ప్రభువైన యెహోవాయొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను నీ నీతినిమాత్రమే నేను వర్ణించెదను. 
Psa 71:17  దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. 
Psa 71:18  దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండు వరకు నన్ను విడువకుము. 
Psa 71:19  దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటియైన వాడెవడు? 
Psa 71:20  అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు. 
Psa 71:21  నా గొప్పతనమును వృద్ధిచేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము 
Psa 71:22  నా దేవా, నేనుకూడ నీ సత్యమునుబట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించె దను. 
Psa 71:23  నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు 
Psa 71:24  వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును. 
Download Audio File 

No comments:

Post a Comment