Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

33వకీర్తన​

Psa 33:1  నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము. .. చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము. 
Psa 33:2  సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి 
Psa 33:3  ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. 
Psa 33:4  యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది. 
Psa 33:5  ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది. 
Psa 33:6  యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. 
Psa 33:7  సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. 
Psa 33:8  లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుప వలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను. 
Psa 33:9  ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. 
Psa 33:10  అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును. 
Psa 33:11  యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. 
Psa 33:12  యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. 
Psa 33:13  యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు. 
Psa 33:14  తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు. 
Psa 33:15  ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించు వాడు. 
Psa 33:16  ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు. 
Psa 33:17  రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు. 
Psa 33:18  వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును 
Psa 33:19  యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది. 
Psa 33:20  మనము యెహోవా పరిశుద్ధనామమందు నమి్మకయుంచి యున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించు చున్నది 
Psa 33:21  మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొను చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు. 
Psa 33:22  యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక. 
Download Audio File 

No comments:

Post a Comment