Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

4వకీర్తన​

Psa 4:1  నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ముఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవేనన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము. 
Psa 4:2  నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు?ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు? 
Psa 4:3  యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి. నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును. 
Psa 4:4  భయమునొంది పాపము చేయకుడిమీరు పడకలమీద నుండగా మీ హృదయములలోధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా. ) 
Psa 4:5  నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవానునమ్ముకొనుడి 
Psa 4:6  మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము. 
Psa 4:7  వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములోపుట్టించితివి. 
Psa 4:8  యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. 
Download Audio File 

No comments:

Post a Comment