Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

76వకీర్తన​

Psa 76:1  యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. 
Psa 76:2  షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది. 
Psa 76:3  అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను. (సెలా. ) 
Psa 76:4  దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు. 
Psa 76:5  కఠినహృదయులు దోచుకొనబడి యున్నారు వారు నిద్రనొంది యున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. 
Psa 76:6  యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను. 
Psa 76:7  నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? 
Psa 76:8  నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి 
Psa 76:9  దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. (సెలా. ) 
Psa 76:10  నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు. 
Psa 76:11  మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. 
Psa 76:12  అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు. 
Download Audio File 

No comments:

Post a Comment