Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

54వకీర్తన​

Psa 54:1  దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము. 
Psa 54:2  దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము. 
Psa 54:3  అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమయెదుట దేవుని ఉంచుకొన్నవారు కారు. (సెలా. ) 
Psa 54:4  ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు 
Psa 54:5  నా శత్రువులు చేయు కీడు ఆయన వారిమీదికి రప్పించును నీ సత్యమునుబట్టి వారిని నశింపజేయుము సేచ్చార్పణలైన బలులను నేను నీకర్పించెదను. 
Psa 54:6  యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
Psa 54:7  ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించి యున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించు చున్నది. 
Download Audio File 

No comments:

Post a Comment