Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

47వకీర్తన​

Psa 47:1  సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి. 
Psa 47:2  యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు. 
Psa 47:3  ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. 
Psa 47:4  తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పద ముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు. 
Psa 47:5  దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. 
Psa 47:6  దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. 
Psa 47:7  దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి. 
Psa 47:8  దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు దేవుడు తన పరిశుద్ధసింహాసనముమీద ఆసీనుడై యున్నాడు. 
Psa 47:9  జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయెను. 
Download Audio File 

No comments:

Post a Comment