Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

38వకీర్తన​

Psa 38:1  యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతచేత నన్ను శిక్షింపకుము. 
Psa 38:2  నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది. 
Psa 38:3  నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు. 
Psa 38:4  నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి. 
Psa 38:5  నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. 
Psa 38:6  నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. 
Psa 38:7  నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు. 
Psa 38:8  నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను 
Psa 38:9  ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు. 
Psa 38:10  నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను. 
Psa 38:11  నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు 
Psa 38:12  నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డు చున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్ను చున్నారు. 
Psa 38:13  చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. 
Psa 38:14  నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని. 
Psa 38:15  యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను. 
Psa 38:16  ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక. 
Psa 38:17  నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు. 
Psa 38:18  నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమునుగూర్చి విచారపడుచున్నాను. 
Psa 38:19  నా శత్రువులు చురుకైనవారును బలవంతులునై యున్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. 
Psa 38:20  మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి 
Psa 38:21  యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము. 
Psa 38:22  రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. 
Download Audio File 

No comments:

Post a Comment