Psa 102:1 యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము.
Psa 102:2 నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తర మిమ్ము.
Psa 102:3 పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి.
Psa 102:4 ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.
Psa 102:5 నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహ మునకు అంటుకొని పోయినవి.
Psa 102:6 నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడికంటెవలె నున్నాను.
Psa 102:7 రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను.
Psa 102:8 దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నామీద వెఱ్ఱికోపముగలవారు నా పేరు చెప్పి శపిం తురు.
Psa 102:9 నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను.
Psa 102:10 నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొను చున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు.
Psa 102:11 నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను.
Psa 102:12 యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరము లుండును.
Psa 102:13 నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను.
Psa 102:14 దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు
Psa 102:15 అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు
Psa 102:16 ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను
Psa 102:17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.
Psa 102:18 యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు
Psa 102:19 మనుష్యులు సీయోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించు నట్లు
Psa 102:20 చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడినవారిని విడిపించుటకును
Psa 102:21 ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునుండి వంగి చూచెననియు ఆకాశమునుండి భూమిని దృష్టించెననియు
Psa 102:22 వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును
Psa 102:23 నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము క్రుంగజేసెను నా దినములు కొద్దిపరచెను.
Psa 102:24 నేనీలాగు మనవిచేసితిని నా దేవా, నాదినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును.
Psa 102:25 ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే.
Psa 102:26 అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును.
Psa 102:27 నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.
Psa 102:28 నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.
Download Audio File

No comments:
Post a Comment