Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Wednesday, September 25, 2013

104వకీర్తన​

Psa 104:1  నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు. 
Psa 104:2  వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు. 
Psa 104:3  జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు 
Psa 104:4  వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను2 తనకు పరిచారకులుగాను ఆయన చేసి కొనియున్నాడు. 
Psa 104:5  భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను. 
Psa 104:6  దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె కప్పితివి. కొండలకుపైగా నీళ్లు నిలిచెను. 
Psa 104:7  నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. 
Psa 104:8  నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను. 
Psa 104:9  అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. 
Psa 104:10  ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును. 
Psa 104:11  అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును. వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును. 
Psa 104:12  వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును. 
Psa 104:13  తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారల నిచ్చును నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది. 
Psa 104:14  పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు 
Psa 104:15  అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు 
Psa 104:16  యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తిపొందుచున్నవి. 
Psa 104:17  అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయు చున్నవి. 
Psa 104:18  గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు 
Psa 104:19  ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియ మించెను సూర్యునికి తన అస్తమయకాలము తెలియును 
Psa 104:20  నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి. 
Psa 104:21  సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలోనుండి తీసికొన జూచుచున్నవి. 
Psa 104:22  సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. 
Psa 104:23  సాయంకాలమువరకు పాటుపడి తమ పనులను జరుపు కొనుటకై మనుష్యులు బయలువెళ్లుదురు. 
Psa 104:24  యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది. 
Psa 104:25  అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి. 
Psa 104:26  అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరము లున్నవి. 
Psa 104:27  తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి 
Psa 104:28  నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును. 
Psa 104:29  నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. 
Psa 104:30  నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. 
Psa 104:31  యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. 
Psa 104:32  ఆయన భూమిని చూడగా అది వణకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును 
Psa 104:33  నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. 
Psa 104:34  ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను. 
Psa 104:35  పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక భక్తిహీనులు ఇక నుండకపోదురు గాక నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము యెహోవాను స్తుతించుడి. 
Download Audio File 

No comments:

Post a Comment