Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Wednesday, September 25, 2013

115వకీర్తన​

Psa 115:1  మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక 
Psa 115:2  వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు? 
Psa 115:3  మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు 
Psa 115:4  వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు 
Psa 115:5  వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు 
Psa 115:6  చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు 
Psa 115:7  చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు. 
Psa 115:8  వాటిని చేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటివంటివారై యున్నారు. 
Psa 115:9  ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము 
Psa 115:10  అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము 
Psa 115:11  యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమి్మక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము. 
Psa 115:12  యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును 
Psa 115:13  పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. 
Psa 115:14  యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును. 
Psa 115:15  భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు. 
Psa 115:16  ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు. 
Psa 115:17  మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు 
Psa 115:18  మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి. 
Download Audio File 

No comments:

Post a Comment