Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, September 24, 2013

118వకీర్తన​

Psa 118:1  యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము. .. .. . నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి 
Psa 118:2  ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక. 
Psa 118:3  ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ స్థులు అందురు గాక. 
Psa 118:4  ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక. 
Psa 118:5  ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను 
Psa 118:6  యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు? 
Psa 118:7  యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. 
Psa 118:8  మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. 
Psa 118:9  రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. 
Psa 118:10  అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. 
Psa 118:11  నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. 
Psa 118:12  కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. 
Psa 118:13  నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను. 
Psa 118:14  యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను. 
Psa 118:15  నీతిమంతుల గుడారములలోరక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. 
Psa 118:16  యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును. 
Psa 118:17  నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ రించెదను. 
Psa 118:18  యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. 
Psa 118:19  నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను. 
Psa 118:20  ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. 
Psa 118:21  నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. 
Psa 118:22  ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. 
Psa 118:23  అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము 
Psa 118:24  ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. 
Psa 118:25  యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. 
Psa 118:26  యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు చున్నాము. 
Psa 118:27  యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. 
Psa 118:28  నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను. 
Psa 118:29  యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 
Download Audio File 

No comments:

Post a Comment