Psa 132:1 యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము.
Psa 132:2 అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట యిచ్చి
Psa 132:3 యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను.
Psa 132:4 ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు
Psa 132:5 నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.
Psa 132:6 అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను.
Psa 132:7 ఆయన నివాసస్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి.
Psa 132:8 యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.
Psa 132:9 నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక.
Psa 132:10 నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము.
Psa 132:11 నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియ మింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుస రించినయెడల వారి కుమారులుకూడ నీ సింహాసనముమీద నిత్యము కూర్చుందురని
Psa 132:12 యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు.
Psa 132:13 యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.
Psa 132:14 ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను
Psa 132:15 దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను
Psa 132:16 దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప జేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు.
Psa 132:17 అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను.
Psa 132:18 అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.
Download Audio File

No comments:
Post a Comment