Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, September 24, 2013

136వకీర్తన​

Psa 136:1  యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:2  దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:3  ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:4  ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:5  తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:6  ఆయన భూమిని నీళ్లమీద పరచినవాడు ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:7  ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:8  పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:9  రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:10  ఐగుప్తుదేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:11  వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పిం చెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:12  చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:13  ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:14  ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో జేసెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:15  ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:16  అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:17  గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:18  ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:19  అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:20  బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:21  ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్ప గించెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:22  తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:23  మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాప కము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:24  మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:25  సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును. 
Psa 136:26  ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుడి ఆయన కృప నిరంతరముండును. 
 Download Audio File 

No comments:

Post a Comment