Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, September 24, 2013

143వకీర్తన​

Psa 143:1  యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపములకు చెవి యొగ్గుము నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము. 
Psa 143:2  నీ సేవకునితో వ్యాజ్యెమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచ బడడు. 
Psa 143:3  శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలముక్రిందట చనిపోయిన వారితోపాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. 
Psa 143:4  కావున నా ఆత్మ నాలో క్రుంగియున్నది నాలో నా హృదయము విస్మయమొందెను. 
Psa 143:5  పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను 
Psa 143:6  నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశ పడుచున్నది. 
Psa 143:7  యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము 
Psa 143:8  నీయందు నేను నమి్మక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము. 
Psa 143:9  యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపింపుము 
Psa 143:10  నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. 
Psa 143:11  యెహోవా, నీ నామమునుబట్టి నన్ను బ్రదికిం పుము నీ నీతినిబట్టి నా ప్రాణమును శ్రమలోనుండి తప్పింపుము. 
Psa 143:12  నేను నీ సేవకుడను నీ కృపనుబట్టి నా శత్రువులను సంహరింపుము నా ప్రాణమును బాధపరచువారినందరిని నశింప జేయుము. 
 Download Audio File 

No comments:

Post a Comment