Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, September 24, 2013

149వకీర్తన​

Psa 149:1  యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. 
Psa 149:2  ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతో షించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టిఆనందించుదురు గాక. 
Psa 149:3  నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక. 
Psa 149:4  యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. 
Psa 149:5  భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక. 
Psa 149:6  వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి. 
Psa 149:7  అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును 
Psa 149:8  గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును 
Psa 149:9  విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి. 
Download Audio File 

No comments:

Post a Comment